వరంగల్‌–కరీంనగర్ ఫోర్ లేన్‌కు గ్రీన్​ సిగ్నల్​

వరంగల్‌–కరీంనగర్  ఫోర్ లేన్‌కు గ్రీన్​ సిగ్నల్​
  • రూ.2,146 కోట్లతో 68 కి.మీల విస్తరణ పనులకు శ్రీకారం
  • 8న ప్రధాని మోదీ చేతులమీదుగా శంకుస్థాపన 
  • రెండు సిటీల మధ్య తగ్గనున్న జర్నీ టైం
  • హైవే విస్తరణకు కృషి చేసిన ఎంపీ బండి సంజయ్​

కరీంనగర్, వెలుగు: కరీంనగర్–-వరంగల్ సిటీల మధ్య హైవే 563 విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న ఈ రోడ్డును ఫోర్ లేన్ల్​గా విస్తరించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8న వరంగల్ పర్యటన సందర్భంగా ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నిత్యం రద్దీగా ఉంటూ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ రహదారిని 4 లేన్లుగా విస్తరించడంతో  ప్రమాదాలు తగ్గడంతోపాటు కరీంనగర్–వరంగల్​సిటీల మధ్య జర్నీ టైం తగ్గనుంది.  

30 గ్రామాలు కవరయ్యేలా ఫోర్ లేన్.. 

భారతమాల పరియోజన కింద కేంద్ర ప్రభుత్వం కరీంనగర్–వరంగల్ వరకు మొత్తం 68.015 కిలోమీటర్ల వరకు విస్తరణ పనులు చేపట్టనుంది. రూ.2,146 కోట్ల అంచనాతో ఈ పనులను చేపడుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే భూ సేకరణ కూడా పూర్తయ్యింది. మొత్తం 325.125 హెక్టార్లు సేకరించిన అధికారులు... బాధితులకు త్వరలో పరిహారం అందించనున్నట్లు చెప్పారు. రెండు సిటీల మధ్య మొత్తం 30 గ్రామాల కవర్ అయ్యేలా ఈ రోడ్డు విస్తరణ పనులు కొనసాగనున్నాయి. విస్తరణలో భాగంగా 5 చోట్ల బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు.

ప్రధానికి ఎంపీ థ్యాంక్స్​ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న వరంగల్–కరీంనగర్​ హైవే విస్తరణకు ఎంపీ బండి సంజయ్ పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. టెక్నికల్​ ప్రాబ్లమ్స్​ అధిగమించడంతో పాటు రాష్ట్ర అధికారులను కలిసి భూసేకరణ వేగవంతమయ్యేలా చేశారు. కేంద్రంతో మాట్లాడి నిధులు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా బండి సంజయ్​మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే హైవే విస్తరణ పనులకు గ్రీన్​సిగ్నల్​రావడం సంతోషంగా ఉందన్నారు. విస్తరణ పనులను   ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించనుండడం సంతోషంగా 
ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఎంపీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.