విశాఖ యువతిపై వరంగల్ యువకుడి దాడి

విశాఖ యువతిపై వరంగల్ యువకుడి దాడి

విశాఖలో ఓ యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతి ప్రత్యూష పై పెట్రోల్  పోసి నిప్పంటించాడు. తర్వాత యువకుడు హర్షవర్ధన్ సూసైడ్ కు ప్రయత్నం చేశాడు. దాడి చేసిన యువకుడు వరంగల్  వాసిగా గుర్తించారు పోలీసులు. యువతి, యువకులిద్దరూ పంజాబ్ లో బీటెక్  చేశారని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిద్దరినీ కేజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.