
- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు
- మిగతా స్థానాలు ఎస్సీ, ఎస్టీ, జనరల్
- ఉమ్మడి జిల్లాలో మొత్తం స్థానాలు 75
- మంగపేట ఎంపీపీ రిజర్వేషన్ పెండింగ్
వరంగల్, ములుగు, వెలుగు: ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. శనివారం 6 జిల్లాలకు సంబంధించి మండలాల వారీగా రిజర్వేషన్లను కలెక్టర్లు ప్రకటించారు. మొత్తం 75 స్థానాలకు గానూ బీసీలకు 31 జడ్పీటీసీ, 27 ఎంపీపీ, ఎస్సీలకు 15 జడ్పీటీసీ, 14 ఎంపీపీ, ఎస్టీలకు 15 జడ్పీటీసీ, 19 ఎంపీపీ, జనరల్‌కు 14 జడ్పీటీసీ, 14 ఎంపీపీ స్థానాలు కేటాయించామని, మంగపేట ఎంపీపీ పెండింగ్ఉందన్నారు.
ఉత్కంఠగా ఎదురుచూసిన ఆశావహుల్లో రిజర్వేషన్ అనుకూలంగా వచ్చినవారు ఖుషీ అవుతుండగా.. రానివారు ఢీలా పడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని భావిస్తే అక్టోబర్ 8 వరకు ఇష్యూ హైకోర్టు పరిధిలో పెండింగ్ ఉండటంతో నిరీక్షణ తప్పని పరిస్థితి నెలకొంది.