స్వచ్ఛ సర్వేక్షణ్లో వరంగల్ కు స్టేట్లో 2వ స్థానం

స్వచ్ఛ సర్వేక్షణ్లో వరంగల్ కు స్టేట్లో 2వ స్థానం

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్​ 2025 ర్యాంకింగ్స్​లో వరంగల్​ పట్టణం దేశంలో 42వ స్థానం, స్టేట్​లో 2వ స్థానంలో ఉందని బల్దియా మేయర్​ గుండు సుధారాణి తెలిపారు.

హర్యానాలో నిర్వహించిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 53వ వార్షిక సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. వరంగల్​ ప్రాముఖ్యతను వివరిస్తూనే, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తెలియజేశారు. సీఎం రేవంత్​రెడ్డి నాయకత్వంలో మహిళల ఆర్థిక సాధికారతను బలోపేతం చేసేందుకు ఇందిర మహిళా శక్తి పథకాన్ని ఆవిష్కరించినట్లు వివరించారు.