చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వారియర్‌గా కనిపించబోతున్నాడు. పొడవాటి జుట్టు, సిక్స్ ప్యాక్ బాడీ, చేతిలో పెద్ద కత్తులతో వార్‌లో శత్రువులపైకి దూసుకెళ్లనున్నాడు. అయితే ఇది రియల్ లైఫ్లోనో, రీల్ లైఫ్లోనో కాదు. ఓ యానిమేటెట్ గ్రాఫిక్ నవలలో ఇలా వారియర్ లుక్‌లో కనిపించి కామిక్ లవర్స్, ఫ్యాన్స్‌ను అలరించబోతున్నాడు. ‘అథర్వ’ అనే టైటిల్‌తో తొందర్లోనే రానున్న ఈ నవలకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో అథర్వ అనే వారియర్ లుక్‌లో సూపర్ హీరోగా కనిపిస్తున్న మహీ వావ్ అనిపించాడు. రమేశ్ తమిల్మని ఈ నవలను రాశారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సంతోషంగా ఉందని ధోనీ చెప్పాడు. ఇందులోని స్టోరీ, ఆర్ట్ వర్క్ తో ప్రతి ఒక్కరూ లీనమవుతారని, కామిక్ లవర్స్ కు ఇదొక పండగలాగా ఉంటుందన్నాడు.
MS Dhoni's first look from 'Atharva: The Origin' unveiled
— ANI Digital (@ani_digital) February 2, 2022
Read @ANI Story | https://t.co/hoZFYz51se#Atharva pic.twitter.com/0IByMl2k4D