సెలవుపెట్టి బెంగళూరు సాఫ్ట్వేర్ ఆత్మహత్య..పనిఒత్తిడిపై సోషల్ మీడియాలో రచ్చ

సెలవుపెట్టి బెంగళూరు సాఫ్ట్వేర్ ఆత్మహత్య..పనిఒత్తిడిపై సోషల్ మీడియాలో రచ్చ

విశ్రాంతి లేకుండా పనిచేయడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటనే సాక్ష్యం. టాలెంట్, వర్క్ స్కిల్స్ఉన్న ఉద్యోగులు కూడా పనిఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడటం.. పని ఒత్తిడి భరించలేక బలవన్మరణాలకు పాల్పడటం వంటి సంఘటన తరుచుగా చూస్తున్నాం.  తాజాగా పనివత్తిడికి బెంగళూరు టెకీ బలయ్యాడు.. వివరాల్లోకి వెళితే.. 

సాఫ్ట్ వేర్ నిఖిల్ సోమవంశీ.. ఓలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అయిన కృత్రిమ్ లో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంలో పనివత్తిడికి లోనై సెలవుపై వెళ్లాడు. ఇంకా వత్తిడినుంచి కోలుకోలదని మరికొన్ని రోజులు సెలవు పెట్టాడు. కంపెనీ సెలవులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. మే 8న సోమవంశీ ఆత్మహత్య చేసుకున్నాడు. 

ALSO READ | Ratan TaTa Wil: రతన్ టాటా వీలునామా..కుటుంబసభ్యులు కాని వ్యక్తికి రూ.588కోట్ల ఆస్తులు

సోమవంశీ ఆత్మహత్యతో ఓలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ క్రుత్రిమ్ సోషల్ మీడయాలో తీవ్రవ్యతిరేకతను ఎదుర్కొంటుంది. సంఘటన సమయంలో సోమవంశీ సెలవులో ఉన్నాడని ప్రకటించడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.  

టాలెంట్, స్కిల్స్ ఉన్న యువ ఉద్యోగుల్లో ఒకరైన నిఖిల్ సోమవంశి విషాదకరంగా మృతిచెందడం చాలా బాధకలిగించింది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి స్నేహితులు, మేం సానుభూతి తెలుపుతున్నామని ఓలా కృత్రిమ్ ప్రకటించింది. 

సోమవంశీ ఆత్మహత్యపై కంపెనీ ప్రకటన, పనివత్తిడిపై ఓ రెడ్డిట్ యూజర్ స్పందిస్తూ.. కంపెనీల్లో పని ఒత్తిడి వాతావరణం బాధాకరమైనది. ముఖ్యంగా కొత్తవారికి. ఇద్దరు వ్యక్తులు రాజీనామా చేశాక ముగ్గురు వ్యక్తుల పనితో అతను బాధపడ్డాడని’ ఆ పోస్ట్ లో రాశారు. నిఖిల్ మేనేజర్ అమెరికాలో ఉంటాడు. ఎక్కువ మంది ఉద్యోగులు ఇక్కడ బెంగళూరులో ఉన్నందున  కాల్స్‌ ద్వారా మీటింగ్ పెడతాడు. ఎడమ, కుడి మధ్యలో ఉన్న వ్యక్తులను తిట్టి అదృశ్యమవుతాడని ఆరోపించారు. 

ఈ పోస్ట్ త్వరగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియా వినియోగదారుల నుండి భారీ వ్యతిరేకతను రేకెత్తించింది.