
రతన్ టాటా..ప్రముఖ భారతీయ వ్యాపార వేత్త..ఆయన చనిపోయే ముందు ఓ వీలునామా రాశారు. అందులో కుటుంబ సభ్యులకు ఎంతెంత ఆస్తులు ఇవ్వాలో రాశారు. అయితే కుటుంబ సభ్యుడు కానీ ఓ వ్యక్తికి కూడా కోట్ల ఆస్తులను పంచుతూ వీలునామా రాశారు రతన్ టాటా..ఆ వ్యక్తి ఎవరు..ఎందుకు ఆయనకు రతన్ టాటా కోట్ల ఆస్తులను పంచారు.. ఆ కథేందో వివరాల్లోకి వెళితే..
తాజ్ హోటల్ గ్రూప్ మాజీ డైరెక్టర్ మోహన్ మోహిని దత్తాకు రతన్ టాటా చనిపోయే ముందు తన ఆస్తిలో వాటాను ఇస్తూ వీలునామా రాశారు. వీలునామా ప్రకారం.. టాటా మిగిలిన ఆస్తిలో మూడింట ఒక వంతు దత్తాకు ఇచ్చారు. దీని విలువ అక్షరాల రూ. 588కోట్లు. రతన్ టాటా ఆస్తి విలువ మొత్తం రూ.3900కోట్లుగా అంచనా వేయబడింది. రిపోర్టు ప్రకారం.. రతన్ టాటా సవతి సోదరీమణులు దినా, షిరిన్ జీజీభోయ్,కుటుంబ సభ్యులు కానీ దత్తాతో పాటు 24 మంది లబ్దిదారులను పేర్లు వీలునామాలో ఉన్నాయి.
మొత్తం వారసత్వ సంపద సుమారు రూ.1,764 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో బ్యాంకు డిపాజిట్లు, విదేశీ కరెన్సీ, విలువైన క్రిస్టల్స్ ,కళాఖండాలు ఉన్నాయి. దత్తా వాటా సుమారు రూ.588 కోట్లు, టాటా క్యాపిటల్‌లో లక్షకు పైగా షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం వీటి విలువ రూ.10 కోట్లకు పైగా ఉంది.
అయితే మొదట్లో దత్తా ఈ వీలునామాకు ఒప్పుకోలేదు..తనకు రావాల్సిన ఆస్తి చాలా ఉందని కొర్రీలు పెట్టారు. అయితే రతన్ టాటా రాసిన వీలునామాలో నిబంధనలు చూసి షాక్ అయ్యారు. ఒకవేళ దత్తా ఈ ఆస్తిని తీసుకునేందుకు ఒప్పుకోకపోతే.. వీలునామా రాసిన ఆస్తికూడా రాదని షరతులు పెట్టారు. దీంతో చివరికి మోహిని దత్తా ఒప్పుకోవాల్సి వచ్చింది.
ఇక వీలునామా ప్రకారం వచ్చిన ఆస్తికి మోహినిదత్తా పన్ను కట్టాలా అనే ప్రశ్నకు కూడా బయలుదేరింది. అయితే వీలునామా ద్వారా వారసత్వంగా వచ్చిన ఆస్తికి భారత చట్టం ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది. దత్తా ఎస్టేట్ నుంచి అందుకునే రూ.588 కోట్లకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
దత్తాకు, రతన్ టాటా అనుబంధం ఎటువంటిది?
రతన్ టాటా, దత్తా తొలిసారి జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో జరిగిన సమావేశంలో కలుసుకున్నారు. ఆ సమయంలో టాటాకు 25యేళ్లు, దత్తాకు కేవలం 13యేళ్లు. టాటా తరువాత దత్తాను ముంబైకి తీసుకువచ్చారు. ట్రావెల్ ఏజెన్సీని స్థాపించడంలో అతనికి సహాయం చేశాడు. చివరికి ఈ ఏజెన్సీ టాటా క్యాపిటల్‌తో విలీనం చేశారు. తర్వాత తాజ్ గ్రూప్ నిర్వహించారు. దత్తా 2019 వరకు తాజ్ గ్రూప్‌లో డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆ ఏజెన్సీని థామస్ కుక్‌కు విక్రయించారు.
రతన్ టాటా వీలునామాలో కుటుంబ సభ్యుడి కానీ ఏకైక లబ్దిదారుగా ఉన్న మోహిని మోహన్ దత్తా .. తొలుత ఆస్తిని తీసుకునేందుకు తిరస్కరించినా.. తర్వాత దాని నిబంధనలను అంగీకరించారు, దీంతో వీలునామా అమలుకు మార్గం సుగమం అయింది.