
Reliance Power Stock: అనిల్ అంబానీ ప్రస్తుతం బిజినెస్ వార్తల్లో అనేకమార్లు వినిపిస్తున్న పేరు. దాదాపు 2008 తర్వాత పతనంతో కనుమరుగైన ఈ అంబానీ సోదరుడు తిరిగి రెండ ఇన్నింగ్స్ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. వ్యాపార బాధ్యతలను కొడుకులు చూసుకుంటున్న నాటి నుంచి వ్యాపారవేత్త విజయాలతో తన వ్యాపారాలను అప్పుల ఊబి నుంచి తిరిగి ఊపిరిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీలు భారీ నష్టాల నుంచి లాభాల్లోకి రావటం ఇన్వెస్టర్లను సంతోషంలో ముంచేస్తోంది.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ సంస్థ భూటాన్ కు చెందిన గ్రీన్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం కోసం టర్మ్ షీట్ పై సంతకం చేసింది. వాస్తవానికి గ్రీన్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ భూటాన్ ప్రభుత్వ పెట్టుబడి విభాగం అయిన డ్రక్ హోల్డింగ్ & ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ కింద పనిచేస్తుంటుంది. దీని ద్వారా అనిల్ అంబానీ సంస్థ భూటాన్‌లో అతిపెద్ద అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తోందని వెల్లడైంది. ఈ వార్త బయటకు రావటంతో రిలయన్స్ పవర్ కంపెనీ షేర్లు దాదాపు 4 శాతం లాభపడ్డాయి.
ప్రస్తుతం రెండు సంస్థల మధ్య కుదిరిన డీల్ ప్రకారం ప్రాజెక్టు 50:50 వాటా వెంచర్ ద్వారా నిర్వహించబడుతుందని తెలుస్తోంది. దీని కెపాసిటీ 500 మెగావాట్లుగా ఉంటుందని తేలింది. బిల్డ్-ఓన్-ఆపరేట్ (BDO) మోడల్ కింద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కోసం రూ.2వేల కోట్లు వెచ్చించనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే భూటాన్ సోలార్ ఎనర్జీ రంగంలో ఇది అతిపెద్ద విదేశీ ప్రైవేటు రంగ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలుస్తుందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
►ALSO READ | UCO Bank: యూకో బ్యాంక్ మాజీ చైర్మన్ అరెస్ట్.. రూ.6వేల 200 కోట్ల కుంభకోణంలో ఈడీ దూకుడు..
ఇక రిలయన్స్ పవర్ షేర్ల విషయానికి వస్తే.. ఇంట్రాడేలో మధ్యాహ్నం 1.17 గంటల సమయంలో ఒక్కో షేరు ఎన్ఎస్ఈలో రూ.45.96 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇక స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.53.64 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.23.30గా కొనసాగుతోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.19వేల కోట్లుగా ఉంది. అనిల్ అంబానీ పతనంలో దాదాపు విలువను కోల్పోయిన ఈ కంపెనీ షేర్లు ప్రస్తుతం తిరిగి పుంజుకుంటూ బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గడచిన ఏడాది కాలంలో ఈ స్టాక్ 80 శాతం వరకు రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది.