
ED Arrest UCO Bank: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం తర్వాత మరో అతిపెద్ద కేసు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ కంపెనీకి సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు యూకో బ్యాంక్ మాజీ చైర్మన్, ఎండీ సుబోధ్ కుమార్ గోయల్ ను దిల్లీలో అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే రూ.వెయ్యి400 కోట్ల బ్యాంకు రుణ కుంభకోణానికి సంబంధించి కాన్‌కాస్ట్ గ్రూప్ చైర్మన్ సంజయ్ సురేకాతో పాటు సుబోధ్ కుమార్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కలకత్తా ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకున్నారని వెల్లడైంది. కేసులో మిగిలిన వ్యక్తుల పాత్ర గురించి తెలుసుకునేందుకు గోయల్ ను ఈడీ అధికారులు కస్టడీలో విచారించనున్నారని వెల్లడైంది.
వాస్తవానికి కాన్‌కాస్ట్ స్టీల్ యూకో బ్యాంక్ నుండి రూ.1,400 కోట్ల రుణాన్ని పొందింది. ఆ మెుత్తాన్ని షెల్ కంపెనీల్లోకి మళ్లించటానికి బ్యాంక్ సహాయం చేయటం ద్వారా గోయల్ లబ్ధిపొందారని ఆరోపణలు ఉన్నాయి. అయితే యూకో బ్యాంక్ సహా మిగిలిన బ్యాంకుల నుంచి పొందిన రుణాల మెుత్తం కుంభకోణం విలువ రూ.6వేల 210 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో యూకో బ్యాంక్ అప్పటి చైర్మన్ కు చట్టవిరుద్ధంగా నగదు, ఖరీదైన ఆస్తులు, హోటల్ బుక్కింగ్స్, విలాసవంతమైన వస్తువులు పొందినట్లు అధికారులు గుర్తించారు. వీటిని సూట్ కేస్ కంపెనీలు, బంధువుల పేరుపై పొందినట్లు తేలింది.
►ALSO READ | AI News: టెక్కీలకు శుభవార్త.. ఆ సంస్థ బయటపెట్టిన ఏఐ ఫెయిల్యూర్ సీక్రెట్..!!
గతనెల 22న గోయల్ కి చెందిన ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారికి అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలు దొరికాయి. కాన్‌కాస్ట్ గ్రూప్ చైర్మన్ సంజయ్ సురేకాను గత ఏడాది డిసెంబర్ 18న అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. ఆ తర్వాత జనవరిలో రూ.210.07 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అంతకు ముందు 2023లో జరిపిన దాడుల్లో కలకత్తా నివాసంలో రూ.2కోట్ల నగదు, రూ.4కోట్ల 50 లక్షలు విలువైన నగలు, లగ్జరీ కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.