నిజం చెప్పినందుకు ఎగతాళి చేశారు: రాహుల్ గాంధీ

నిజం చెప్పినందుకు ఎగతాళి చేశారు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ ఎంత తీవ్రతరం అవుతుందో చెప్పినందుకు తనను ఎగతాళి చేస్తున్నారని కాంగ్రెసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నాశనమయ్యాయి. పెద్ద కంపెనీలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. బ్యాంకులు కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎకనామిక్ సునామీ వస్తోందని కొన్ని నెలల క్రితమే నేను హెచ్చరించా. అప్పుడు నిజం చెప్పినందుకు బీజేపీతోపాటు మీడియా కూడా నన్ను ఎగతాళి చేసింది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి కార్పొరేట్ ఒత్తిడి అదనంగా మరో 1.68 లక్షల కోట్లు పెరిగే చాన్స్ ఉన్న ఓ ఆర్టికల్‌ను ఆ ట్వీట్‌కు రాహుల్ జత చేశారు. దేశ ఆర్థిక లోటు ప్రతిపాదిత బడ్జెట్ కంటే 3.5 శాతానికి మించి పెరుగుతుందని ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు.