మేయర్ ఇంటి ముందు ధర్నా

మేయర్ ఇంటి ముందు ధర్నా

నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ ఇంటి ముందు రజకులు ధర్నా చేపట్టారు.మేయర్ భర్త శేఖర్ ధోబీ ఘాట్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మేయర్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. గతంలో కూడా మేయర్ భర్త శేఖర్ పై భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. మేయర్ డౌన్.. డౌన్.. భూ కబ్జాదారులను తరిమికొట్టాలంటూ నినాదాలు చేశారు. 
40  సంవత్సరాల క్రితం టీడీపీకి చెందిన మంత్రి సత్యనారాయణ హయాంలో రజకులకు దోబీఘాట్ కేటాయించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు దోబీఘాట్ నడుస్తూనే ఉందని, రజకులు దోబీఘాట్ ద్వారా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. అయితే ఏడాది కాలంగా అధికార పార్టీ నేతల కన్ను ఈ జాగాపై పడిందని.. రెండుసార్లు కబ్జా చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 
స్థానిక కార్పొరేటర్ రోడ్డేస్తాం.. డ్రైనేజీ పేరుతో దోబీఘాట్ తొలగించాలని ప్రయత్నిస్తే తీవ్రంగా వ్యతిరేకించామన్నారు. 
ఈరోజు మేయర్ భర్త దండు శేఖర్.. అక్రమంగా వచ్చి.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పొక్లెయినర్ తో తవ్వకాలు చేయించారని..మేము వెంటనే అడ్డుకుని ఎందుకిలా చేస్తున్నారని అడిగితే పారిపోయారని అన్నారు. మేమంతా ర్యాలీగా వెళ్లి మేయర్ ఇంటి ముందు కూర్చుని నిరసన తెలియజేస్తే మాకు సంబంధం లేదని.. గాని మేం చేయలేదని గాని ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. దయచేసి తమ రజకుల జీవనోపాధి పోగొట్టొద్దని వారు కోరారు.