
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు సీరీస్ పై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. హోరాహోరీగా.. రసవత్తరంగా సాగిన సీరీస్ లో నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి రెండు జట్లు. భారత్ ను చాలా తక్కువ అంచనా వేసిన ఇంగ్లాండ్.. అంచనాలకు మించిన ఆట చూసి షాక్ కు గురైంది. తేలికగా ఓడించి సీరీస్ సొంతం చేసుకుంటామనే అతి విశ్వాసంపై గట్టి దెబ్బ కొట్టారు ఇండియా ప్లేయర్లు. గెలుస్తామని కలలు కంటున్న సీరీస్ డ్రా అయ్యే సరికి చతికిలపడిపోయారు. అయితే గెలిచేందుకు ఇంగ్లాండ్ ప్లేయర్లు చేసిన చీప్ ట్రిక్స్ పై ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ భలే రసవత్తరంగా సాగింది. ఒక మ్యాచ్ గెలిచి ఊపు మీదున్న ఇంగ్లాండ్ కు రెండో మ్యాచ్ లో ఓటమి రుచి చూపించింది ఇండియా. వెంటనే మూడో మ్యాచ్ లో చిత్తు చేసి ఇక సీరీస్ సొంతం చేసుకోవచ్చు అనుకున్న ఇంగ్లండ్ కు.. డ్రా చేసి షాకిచ్చారు ప్లేయర్లు. అయినా గెలుపు మాదే అన్న ధీమాతో ఉన్న ఇంగ్లాండ్ ను చివరి టెస్టులో ఊహించని విధంగా దెబ్బకొట్టి సీరీస్ నే డ్రాగా మలిచింది గిల్ సేన. ఇంతలా పోటా పోటీగా సాగిన సీరీస్ లో ఇంగ్లాండ్ ప్లేయర్లు ఎలాగైనా గెలవాలనే విశ్వప్రయత్నంలో ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలని చూశారు.
నాలుగో టెస్టులో సున్నాకే రెండు వికెట్లు పడటంతో టెస్టు మాదే అనుకున్నారు ఇంగ్లండ్ ప్లేయర్లు. కానీ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అత్యద్భుతమైన ప్రతిభతో ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లారు. ఆటలో నాలుగో రోజు గిల్ (103), రాహుల్ (90) భారీ భాగస్వామ్యం నెలకొల్పగా.. వీరిద్దరూ ఔటైనా జడేజా (107), సుందర్ (101) ఇంగ్లాండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి మ్యాచ్ ను డ్రా గా ముగించిన విషయం తెలిసిందే. అయితే వీళ్లను ఈజీగా పడగొట్టగలం అనుకున్న ఇంగ్లాండ్.. ఎంత ప్రయత్నించినా ఔట్ కాకపోవడం.. సెంచరీలకు చేరువై ఇక డ్రా తప్పదని అవతలి వాళ్లకు తెలిసొచ్చేలా చేయడంతో పూర్తిగా ఢీలా పడిపోయార ప్రత్యర్థి జట్టు ప్లేయర్లు.
మాంచెస్టర్ టెస్టు ఇక డ్రా తప్పదు అని భావించిన స్టోక్స్.. డ్రా కోసం షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూడటం చర్చనీయాంశంగా మారింది. డ్రా చేసుకుందాం అని చెప్పినా మనోళ్లు తగ్గకపోవడంతో ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ఫ్రస్టేషన్ కు గురయ్యాడు. ఎలాగో డ్రా తప్పదు.. ఐదో టెస్టు కోసం బౌలర్లకు రెస్టు ఇద్దామని భావించాడు స్టోక్స్. కానీ జడేజా, సుందర్ అందుకు నిరాకరించడంతో అసహనానికి గురయ్యాడు.
షేక్ హ్యాండ్స్ పేరున అటెన్షన్ డైవర్ట్ చేయాలని చూసినట్లు సుందర్ చెప్పాడు. సెంచరీల వైపు దూసుకెళ్తున్న తమ కాన్సంట్రేషన్ దెబ్బ కొట్టాలని చూసినట్లు చెప్పాడు సుందర్. టైమ్ వేస్ట్ టాక్టిక్స్ ప్లే చేసినట్లు దీనిపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. వాళ్లు మా అటెన్షన్ డైవర్ట్ చేయాలని.. డిస్టర్బ్ చేయాలని చూసి.. చివరికి మా ప్రతాపం చూశారు.. అంటూ మ్యాచ్ కు సంబంధించిన మెమరీస్ ను చెప్పుకొచ్చాడు. అయితే వాళ్లు డ్రా కోసం అడిగినప్పుడు రికార్డ్సు కోసం ప్రయత్నించారుగా అనే ప్రశ్నకు.. అది ఏ గేమ్ లోనైనా ఉంటుందని చెప్పాడు. ఓన్లీ క్రికెట్లోనే కాదు.. ఎక్కడైనా సహజం. ముఖ్యంగా క్రికెట్లో ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దానికి గట్టిగా బదులివ్వడం చూస్తుంటామని అన్నాడు.
ముందునుంచి తమను చాలా తక్కువ అంచనా వేసి.. ఛాలెంజ్ చేశారని చెప్పాడు. వాళ్ల ఛాలెంజ్ కు రిప్లై గా సెంచరీలు చేసి చూపించామని అన్నాడు. ఒకరకంగా వాళ్ల ఛాలెంజ్ వల్లనే తాము విరుచుకుపడినట్లు చెప్పాడు. బెన్ స్టోక్స్ అతి విశ్వాసం వల్లనే నాలుగో టెస్టు ఇంగ్లడ్ కోల్పోయిందని చెప్పాడు. కొన్ని సార్లు కొందరు చేసే పనితో మనలోని ప్రతిభ తన్నుకుంటూ బయటకు వస్తుందని చెప్పాడు. డిస్టర్బ్ చేయాలని చూస్తే.. వాళ్లనే డిస్టర్బ్ చేసి వచ్చామని.. ఇంగ్లండ్ టూర్ మెమరీస్ పంచుకున్నాడు సుందర్.