Ishan Kishan: ఇషాన్ స్పిన్నర్లని ఎదుర్కోవడంపై దృష్టిపెట్టాలి: వసీం జాఫర్

Ishan Kishan: ఇషాన్ స్పిన్నర్లని ఎదుర్కోవడంపై దృష్టిపెట్టాలి: వసీం జాఫర్

లెఫ్టా హ్యాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ హోదాలో రిషబ్ పంత్ ని భర్తీ చేస్తాడనుకునన్ ఇషాన్ కిషన్, గ్రౌండ్ లో తడబడుతున్నాడు. బంగ్లాదేశ్ పై చేసిన డబుల్ సెంచరీ మినహా ఇషాన్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీసుల్లో ఘోరంగా విఫలం అయ్యాడు. బ్యాటుతో రాణించలేకపోతున్న ఇషాన్ గురించి మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్లో నిలకడగా ఆడాలంటే కష్టపడాలని ఇషాన్ కి సూచించాడు. 

ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోలో మాట్లాడిన జాఫర్ ‘ఇషాన్ ప్రతీసారి నిరాశపరుస్తున్నాడు. అతను పరిమిత ఓవర్లో నిలకడగా రాణించడానికి కృషి చేయాలి. స్పిన్ బౌలింగ్ లో ఒకేవిధంగా ఔట్ అవుతున్నా తన తప్పు తెలుసుకోవడం లేదు. ఈ విషయాలపై దృష్టిపెట్టాలి’ అని అన్నాడు. ఈ సిరీస్ లో ఇషాన్ కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు.