వీడియో వైరల్: నూడుల్స్ ఇలా కూడా వండొచ్చా?

వీడియో వైరల్: నూడుల్స్ ఇలా కూడా వండొచ్చా?

న్యూఢిల్లీ: ఒకేసారి రెండు పనులు చేయడం కష్టం అంటుంటారు చాలా మంది. నిపుణులు కూడా ఒకేసారి ఒకే పని మీద దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయని సూచిస్తుంటారు. కానీ ఇక్కడో ఓ అమ్మాయి మాత్రం తన వంటకాలపై ప్రజల అటెన్షన్ పడేందుకు ఒకేసారి రెండు పనులు చేసింది. ఒకవైపు నూడుల్స్ వండుతూనే మరోవైపు డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. ఇందులో విశేషం ఏంటంటే నూడుల్స్ ఉన్న ప్యాన్‌‌‌ను ఒక చేతితో గాలిలో చుట్టూరా తిప్పుతూ పాపులర్ సాంగ్ అయిన గంగ్నమ్‌‌ డ్యాన్స్‌‌‌కు స్టెప్స్ వేయడం. సదరు శెఫ్ రిథమిక్‌ స్టెప్స్‌‌తో కస్టమర్స్‌‌ను అట్రాక్ట్ చేసింది. ఈ వీడియో నెట్‌‌లో వైరల్ అవుతోంది. ఇప్పటికే దీనికి 9.1 మిలియన్ వ్యూస్ రాగా, 66 వేల రీట్వీట్స్ రావడం విశేషం. ఈ మల్టీ ట్యాలెంటెడ్ శెఫ్, డ్యాన్సర్ వీడియోను మీరూ చూసేయండి.