తాగునీటి కోసం సిటీవాసుల ధర్నా

తాగునీటి కోసం సిటీవాసుల ధర్నా

హైద్రాబాద్ లో తాగునీటి కష్టాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. బస్తీల్లోనే కాకుండా అభివృద్ధి చెందిన కాలనీల్లోనూ…. నీటి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రగతినగర్ కాకతీయ హిల్స్ లో రెండు నెలలుగా సరిగా నీటి సరఫరా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. 15 రోజుల నుంచి మొత్తానికే నీరు రావడం లేదని చెప్తున్నారు. నీళ్లు రాకపోయినా ప్రతీ నెలా 4 వేల రూపాయల వాటర్ బిల్లు కడుతున్నామని అంటున్నారు. అధికారులు స్పందించి సమస్య తీర్చే వరకు ఆందోళన చేస్తామన్నారు కాకతీయ హిల్స్ వాసులు