
- మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
- ఎల్‌ఎండీ నుంచి కాకతీయ కెనాల్‌కు నీటిని విడుదల
తిమ్మాపూర్, వెలుగు: కాళేశ్వరం నుంచి ఎత్తిపోయకుండానే పంటలకు సాగునీరందిస్తున్నామని మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యానారాయణ అన్నారు. బుధవారం ఉదయం ఎల్‌ఎండీ నుంచి కాకతీయ కెనాల్‌కు నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వానలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయని తెలిపారు. ఎల్‌ఎండీ పూర్తిస్థాయి సామర్థ్యం 24.034టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22.534టీఎంసీలున్నాయన్నారు. డ్యాంలోకి 3,721క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 3,305 క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా ఉందన్నారు.