
- కాలేజీ ఆవరణలో స్నానాలు చేసి స్టూడెంట్ల వినూత్న నిరసన
మెహిదీపట్నం, వెలుగు: హాస్టల్‌ను ఎత్తివేసేందుకు అధికారులు కుట్ర చేస్తున్నారని.. అందుకే మెస్‌ను, నీళ్లను బంద్ చేశారంటూ మాసబ్ ట్యాంక్‌లోని జేఎన్ఏఎఫ్ఏయూ(జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ వర్సిటీ) స్టూడెంట్లు శనివారం ఆందోళనకు దిగారు. మేనేజ్మెంట్ వైఖరికి నిరసనగా వర్సిటీలోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీ మెయిన్ డోర్ ముందు మొహలు కడుక్కుని, స్నానాలు చేసి వినూత్న నిరసన తెలిపారు.
ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ హాస్టల్ అబిడ్స్‌లోని గన్‌ఫౌండ్రీ ఏరియాలో ఉంది. అయితే, కొద్దిరోజులుగా హాస్టల్‌కు వాటర్ ట్యాంకర్ రాకపోవడంతో నీళ్లు లేక స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. దీంతో శనివారం మాసబ్ ట్యాంక్‌లోని వర్సిటీ ఆవరణకు బకెట్లతో నీళ్లను తెచ్చి అక్కడే మొహలు కడిగారు. స్నానాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు మాట్లాడుతూ.. నిజాం కాలం నుంచి ఉన్న జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ 2008లో యూనివర్సిటీగా ఏర్పడిందన్నారు.
వర్సిటీకి చెందిన హాస్టల్50 ఏండ్లుగా అబిడ్స్‌లోని గన్‌ఫౌండ్రీ ఏరియాలో ఉందన్నారు. ఎంతో చరిత్ర ఉన్న హాస్టల్‌ను ఎత్తివేసేందుకు రెండేండ్లుగా కొత్త అడ్మిషన్లను మేనేజ్ మెంట్ నిలిపివేసిందని స్టూడెంట్లు ఆరోపించారు. మెస్ సౌకర్యాన్ని బంద్ చేశారని.. రెండ్రోజులుగా హాస్టల్‌కు వాటర్ ట్యాంకర్ రావడం లేదన్నారు. ఇప్పటికైనా హాస్టల్లో వసతులు ఏర్పాటు చేయాలని స్టూడెంట్లు కోరారు.