- మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై కాంగ్రెస్ నాయకుల ఫైర్
ముత్తారం, వెలుగు: మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాణ్యత లేకుండా పనులు చేసి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం మండిపడ్డారు. శుక్రవారం ముత్తారంలోని కాంగ్రెస్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. న్యాయవాద దంపతులను నడిరోడ్డుపై నరికి చంపిన కేసులో సీబీఐ ఎంక్వైరీ జరుగుతుండటంతో పుట్ట మధుకు భయం పట్టుకుందని విమర్శించారు.
కాంగ్రెస్ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతాలోపంతో నిర్మించిన కట్టడాలు కూలిపోతే అధికార పార్టీ పేల్చేస్తోందనడం సిగ్గుచేటన్నారు. లీడర్లు దొడ్డ బాలాజీ, మద్దెల రాజయ్య, యాదగిరిరావు, వినీత్, శంకర్, చారి తదితరులున్నారు.
