తంగళ్లపల్లి, వెలుగు: సర్పంచుల ఫోరం తంగళ్లపల్లి మండల అధ్యక్షుడిగా బస్వాపూర్ సర్పంచ్ పూర్మాని రాజశేఖర్ రెడ్ది, ప్రధాన కార్యదర్శిగా రాళ్లపేట సర్పంచ్ బాలసాని పరశురాములు శుక్రవారం ఎన్నికయ్యారు.
సహచర సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు వారిని సత్కరించారు. త్వరలోనే పూర్తి కమిటీని ఏర్పాటు చేస్తామని అధ్యక్షుడు తెలిపారు. కార్యక్రమంలో సెస్ చైర్మన్ చిక్కాల రామరావు, సర్పంచుల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు మాట్ల మధు, గజభీంకార్ రాజన్న, నాయకులు పాల్గొన్నారు.
