- కలెక్టర్ పమేలా సత్పతి
- రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్సంబురాలు ప్రారంభం
కొత్తపల్లి, వెలుగు: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని, చెకుముకి, సైన్స్ ఫెయిర్ ఇందుకు దోహదం చేస్తాయని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ స్కూల్లో మూడు రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి చెకుముకి సంబురాలను శుక్రవారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ ప్రతీ అంశాన్ని శాస్త్రీయ కోణంలో ఆలోచించాలని చెప్పారు. ప్రజల్లో మూఢనమ్మకాలను చెరిపేసేందుకు జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. విద్యార్థులు గణితం, సైన్స్ సబ్జెక్టులపై దృష్టి పెట్టాలని సూచించారు.
టీచర్లు థియరీతోపాటు ప్రాక్టికల్స్‌పై ఫోకస్చేయాలన్నారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు చెలిమెల రాజేశ్వర్, కార్యదర్శి పి.మణీంద్రం, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్‌రావు, నిమ్స్ మాజీ డైరెక్టర్ ప్రసాదరావు, పారమిత విద్యాసంస్థల చైర్మన్ ఇనుగంటి ప్రసాదరావు, చక్రపాణి, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ రాంబాబు, జిల్లా సైన్స్ అధికారి జయపాల్‌రెడ్డి, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ కర్ర అశోక్‌రెడ్డి, జేవీవీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి, నాయకులు ఆనంద్‌కుమార్, వెంకటేశ్వరరావు, రామచంద్రయ్య, శ్రీకాంత్, వరప్రసాద్, అందె సత్యం, సీహెచ్.రామరాజు తదితరులు పాల్గొన్నారు.
