హైదరాబాద్లో జనవరి 3న ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్

హైదరాబాద్లో జనవరి 3న ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్

హైదరాబాద్, వెలుగు:  కృష్ణా వాటర్ సప్లై ఫేజ్–1పరిధిలోని సంతోష్ నగర్ వద్ద పైపులైన్ జంక్షన్ పనులకు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో సిటీలోని పలు ప్రాంతాల్లో నీళ్ల సరఫరా బంద్ కానున్నట్టు మెట్రోవాటర్​బోర్డు అధికారులు తెలిపారు.  ఈ నెల 3వ తేదీ బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు గురువారం ఉదయం ఆరు  గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని వెల్లడించారు. 

మీరాలం, కిషన్ బాగ్, అల్జుబైల్ కాలనీ, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్ గూడ, ఆస్మాన్ గఢ్, యాకుత్ పురా, మాదన్నపేట్, మహబూబ్ మాన్షన్,  రియాసత్ నగర్, అలియాబాద్, బొగ్గుల కుంట, అఫ్జల్ గంజ్, నారాయణ గూడ, అడిక్ మెట్, శివం రోడ్, నల్లకుంట, చిలకలగూడ, దిల్ సుఖ్ నగర్ లోని పలు ప్రాంతాలు, బొంగుళూరు, మన్నెగూడ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు పేర్కొన్నారు.  

ఎస్ఆర్డీపీ పనుల్లో సంతోష్ నగర్ వద్ద కొత్తగా నిర్మించే ఫ్లై ఓవర్‌‌కు ఇబ్బందులు కలగకుండా జంక్షన్  పనులు చేస్తుండగా నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.