Vastu Tips : వాటర్ సంప్ ఏదిక్కులో ఉండాలి.. బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూంను ఎలా కట్టుకోవాలి..!

Vastu Tips :  వాటర్ సంప్ ఏదిక్కులో ఉండాలి.. బెడ్రూమ్ లో  అటాచ్డ్ బాత్రూంను ఎలా  కట్టుకోవాలి..!

ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ఇంటి విషయంలో వాస్తు పద్దతిని తప్పక పాటించాలి.   బెడ్​ రూంలో అటాచ్​ డ్​ బాత్రూం.. వాటర్​ సంప్​ ఏ దిక్కులో ఉండాలి.  వీటి విషయంలో  వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ ( 9440088799) గారి సలహాలను ఒకసారి చూద్దాం. . 

ప్రశ్న: అటాచ్డ్ బాత్రూమ్స్ కట్టొచ్చా?..ఉత్తర వాయువ్యం, పడమర వాయువ్యంలో రెండు బెడ్​ రూమ్స్ కట్టుకుంటున్నాం. వాటికి అటాచ్డ్ బాత్రూమ్స్ ఎటువైపు ఉంటే బాగుంటుంది?

జవాబు: నైరుతి బెడ్రూమ్ లోపల వాయువ్యంలో లేదా ఆగ్నేయం దిక్కులో బాత్రూమ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. రెండు బెడ్​ రూమ్స్ ఈ దిక్కుల్లోనే బాత్రూమ్స్ కట్టుకోవాలి.

ప్రశ్న:  వాయువ్యంలో సంప్.. మెయిన్ గేట్ పక్కనే వాయువ్యంలో సంప్ ఏర్పాటు చేసుకోవచ్చా?

జవాబు : ఇంటి వాయువ్యంలో సంప్ ఏర్పాటు చేసుకోకూడదు. గొయ్యితో ఏర్పాటయ్యే సంప్ వాయువ్యంలో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. తూర్పు లేదా పడమర ఫేసింగ్, ఉత్తర లేదా దక్షిణ ఫేసింగ్.. ఏవైపు ఫేసింగ్ ఉన్నాసరే తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యం దిక్కుల్లోనే సంప్​ కట్టుకోవాలని  వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ సూచిస్తున్నారు. 

►ALSO READ | Family Relationship : పెద్దలు ఆశ్రమాల్లో.. పిల్లలు హాస్టళ్లల్లో.. విడిపోతున్న కుటుంబ బంధాలకు కారణం ఏంటీ..?