సిటీలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం - వాటర్ బోర్డు అధికారులు

సిటీలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం - వాటర్ బోర్డు అధికారులు

హైదరాబాద్, వెలుగు: సిటీలోని పలు ప్రాంతాల్లో  24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు వాటర్ బోర్డు అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  ఆటోనగర్  నుంచి నాగోల్ వరకు నాలుగు ప్రాంతాల్లో లీకేజీలుండటంతో పైప్ లైన్ కు అత్యవసర రిపేర్లు చేపట్టున్నట్లు చెప్పారు. దీంతో గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల వరకు  ఉప్పల్ మెట్రో రైల్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, దేవేందర్ నగర్, రామంతపూర్ , శ్రీ సాయి ఆర్టీసీ కాలనీ, ఆదర్శనగర్, వెంకట్ సాయి నగర్, శ్రీ కృష్ణ కాలనీ, ఓల్డ్ పీర్జాదిగూడ, మల్లికార్జున నగర్ ఫేస్–1,2, భవానీ నగర్ కాలనీలు,  పీర్జాదిగూడ  కార్పొరేషన్,  పెద్ద అంబర్ పేట, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, ఎన్టీఆర్ నగర్ బస్తీ, వాస్తు కాలనీ, ఆర్టీసీ కాలనీ, శివగంగా కాలనీ, శ్రీనివాస కాలనీ, శివమ్మ బస్తీ, నాగోల్ ప్రాంతాల్లో 24 గంటలపాటు నీటి సప్లయ్ ఉండదన్నారు.