హైదరాబాద్ వాసులకు.. మూడు రోజులు నీటి సరఫరా బంద్

హైదరాబాద్ వాసులకు.. మూడు రోజులు నీటి సరఫరా బంద్

హైదరాబాద్ వాసులకు చేదువార్త. హైదరాబాద్ వాసులకు మూడు రోజుల పాటు నీటి సరఫరా నిలిచే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లా మల్లారంలోని పంప్ హౌజ్ లోని వాటర్ ఫిల్టర్ లో మోటార్లు నీటమునగడంతో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. 

హైదరాబాద్ కు నీటిని సరఫరా చేసేందుకు ఎల్లంపల్లి నుంచి సిద్దిపేట జిల్లా మల్లారం పంప్ హౌజ్ లోకి అధికారులు నీటిని విడుదల చేశారు. అయితే అధికారులు వాటర్ ఫిల్డర్ లోని మోటార్లను సరైన సమయంలో ఆన్ చేయకపోవడంతో  పంప్ హౌజ్ మొత్తం నీటమునిగింది. పంప్ హౌజ్ లోకి భారీగా నీరు చేరింది. ఈ నీటిని క్లియర్ చేసి..మళ్లీ మోటార్లు ఆన్ చేయాలంటే కనీసం 3 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. 

సిద్దిపేట జిల్లా మల్లారం పంప్ హౌజ్ నుంచి హైదరాబాద్‌ లోని  శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, సైనిక్‌పురి, నిజాంపేట్, పటాన్‌చెరు, బాచుపల్లి తదితర ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. వీటితోపాటు సిద్దిపేట, జనగాం, భువనగిరి, మేడ్చల్‌ పరిధిలోని వందలాది గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తారు. 2021 అగస్ట్ లో వరద ల కారణంగా మోటార్లు నీట మునిగాయి. మే 07వ తేదీన అధికారుల నిర్లక్ష్యంతో మరోసారి మోటార్లు నీట మునిగాయి. అయితే మోటార్లు  మధ్యాహ్నం నుంచి  నీటిలో మునిగినా...అధికారులు మాత్రం గోప్యంగా ఉంచారు