
వయనాడ్ మారణకాండ మిగిల్చిన విషాదం నుండి దేశం ఇంకా కోలుకోలేకపోతోంది.ఈ దుర్ఘటనలో గల్లంతైనవారిలో ఇంకా 180మంది ఆచూకీ లభించలేదు. మరో పక్క ఆచూకీ లభించని 189 మృతదేహాలకు ఇవాళ ( ఆగస్టు 5, 2024 ) సామూహిక అంత్యక్రియలు నిర్వహించనున్నారు.పుత్తుమలలోని 64 సెంట్ల శ్మశాన వాటికలో మొత్తం 189 మృతదేహాలు ఖననం చేయనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ఈ సామూహిక ఖననం జరగనుంది. ఇంత భారీ సంఖ్యలో మృతదేహాలను ఖననం చేసేందుకు సంస్థాగత సహకారం అవసరమని రెవెన్యూ శాఖ మంత్రి కే రాజన్ అన్నారు.
ALSO READ | వయనాడ్లో రెస్క్యూ కొనసాగుతోంది.. తవ్వినకొద్దీ శవాలే
ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక ప్రణాలికను సిద్ధం చేసినట్లు తెలిపారు మంత్రి రాజన్. ప్రతి మృతదేహాన్ని, వికృత భాగాన్ని ప్రత్యేక శవపేటికలో పెట్టి పాతి పెడతామని అన్నారు. ప్రతి శవపేటిక లోపల, బయట డిఎన్ఏ కోడ్ బాక్స్ ఉంచుతామని తెలిపారు .ఖననం చేయడానికి ముందు అన్ని విశ్వాసాల ప్రార్థనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పుత్తుమలలోని శ్మశాన వాటికలో ఒక సెంటు స్థలంలో కనీసం ఏడు మృతదేహాలను పాతిపెట్టే విధంగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.