
ఈ ఫొటో జూస్తే కోతులు గూడ మనుషుల లెక్కనే జేస్తున్నయ్! అనిపిస్తుంది గదా. వెనకటికయితే మనుషులు ఏం జేస్తే కోతులు అది జేస్తయని కోతి – టోపీల కథ జెప్పేది. గానీ... ఈ ఫొటోలోని కోతుల్ని జూస్తుంటే వీటికి గూడ మంచి రోజులు అచ్చినయ్ అనిపిస్తుంది. ‘‘గిప్పుడు ట్రెండ్ మారింది. మేం గూడ అప్డేట్ అయినం. ఆ టోపీల కథ మార్చాలని కంకణం గట్టుకున్నం’’ అనుకున్నట్టున్నయ్ గీ కోతులు. గందుకే గిప్పటి ట్రెండ్‌ను ఫాలో అయితున్నయ్. పాత కాలంలనంటే టెక్నాలజీ లేదాయె.. అంటే చేతిల సెల్‌ఫోన్ అనేది ఉండది. మరి గిప్పుడో చిన్నపోరల నుంచి పండు ముసలోల్ల దాంక సెల్‌ఫోన్ వాడుతున్నరాయె. ఈ కాలంల ఆండ్రాయిడ్, ఐఫోన్, ల్యాప్‌టాప్‌లు లేనిదే జిందగీ నడవదు. ‘‘మరి మనిషి ఏది జేత్తే మేం అది జెయ్యాల గదా..” అంటున్నయ్ గీ కోతులు. గందుకే గీ ట్రెండ్‌కు తగ్గట్టే కోతి చేష్టలు జేస్తున్నయ్. గీ ఫొటోలు గిప్పుడు నెట్టింట్ల వైరలైనయ్.