పరిగి, వెలుగు: మహిళల ఆరోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయార్టీ ఇస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. స్వస్థ్‌నారి సశక్త్ కార్యక్రమంలో భాగంగా గురువారం పరిగి ప్రభుత్వ దవాఖానలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఆయన గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. మహిళలు నెలకు లేదా సంవత్సరానికోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీంద్రనాయక్, ప్రవీణ్‌కుమార్, ప్రోగ్రామ్ హెల్త్ ఆఫీసర్లు పవిత్ర, జానీ, నిరోషా, శ్రీనివాస్, పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య పాల్గొన్నారు.
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగావకాశాలు..
విద్యార్థులు ఆటల్లోనూ రాణించాలని, స్పోర్ట్స్‌కోటాలో ఉద్యోగావకాశాలు ఉంటాయని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం పరిగి స్కూల్లో 69వ జోనల్ స్థాయి అండర్-14, 17 బాలుర, బాలికల కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇండియా టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహమ్మద్ సిరాజ్ ఈ గ్రౌండ్లో అనేక టోర్నీలు ఆడారని గుర్తుచేశారు. ప్రస్తుత ఒత్తడి జీవితంలో ఆటలు ఎంతో అవసరమన్నారు.
