మా మూవీకి కూడా బుకింగ్స్ బాగుండటం సంతోషం

మా మూవీకి కూడా బుకింగ్స్ బాగుండటం సంతోషం

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కార్తికేయ 2’. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వాల్ కలిసి నిర్మించిన ఈ చిత్రం, ఇవాళ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, రచయిత విజయేంద్ర ప్రసాద్, హీరోలు అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించాలని విష్ చేశారు. నిఖిల్ మాట్లాడుతూ ‘కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తారని మేజర్, సీతారామం, బింబిసార చిత్రాలు నిరూపించాయి. మా మూవీకి కూడా బుకింగ్స్ బాగుండటం సంతోషం. తమ సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ సినిమాని నిర్మాతలు నెక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి తీసుకెళ్లారు. మైనస్ డిగ్రీల చలిలో కూడా అనుపమ అద్భుతంగా నటించింది. ఆర్ట్ వర్క్, వీఎఫ్ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మ్యూజిక్ హైలైట్. కృష్ణతత్వంతో పాటు ఇండియన్ కల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ హెరిటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కూడా చూపించాం. మన దేశపు మూలాల్ని గుర్తుచేసే సినిమా.

ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఎంతలా ఎంజాయ్ చేశారో దీన్నీ అంతే ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. ‘రిలీజ్ కోసం ఎక్సైటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదురు చూస్తున్నాను. అలాగే కొంత నెర్వస్ కూడా ఫీలవుతున్నాను’ అని చెప్పింది అనుపమ. చందు మాట్లాడుతూ ‘అమర్ చిత్ర కథ, రామాయణ, మహాభారతాలు లాంటివి చిన్నప్పుడు చదవడం వల్లే నేనీ సినిమా తీయగలిగాను. కానీ ఇప్పటి జెనరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిల్లలకు గ్రీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విదేశీ ఫిలాసఫీ తెలిసినంతగా మన కల్చర్ గురించి, మూలాల గురించి తెలియదు. అందుకే పిల్లలు ఈ సినిమాని చూడాలి. పూజలు, ఆచారాల పేరుతో ఆహారాన్ని వృథా చేస్తున్నామని చాలామంది విమర్శిస్తుంటారు. కానీ వాటి వెనుక కొన్ని నిజాలున్నాయి. విశ్లేషణ చేయకుండా విమర్శించడం కరెక్ట్ కాదు. అలాంటివన్నీ చర్చించాం’ అన్నాడు. నటులు శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ తదితరులు పాల్గొన్నారు.