OTT Wedding Deal: పెళ్లి ఓటీటీ స్ట్రీమింగ్కి ‘NO’ చెప్పిన విజయ్-రష్మిక.. రూ.60 కోట్ల ఆఫర్‌ రిజెక్ట్!

OTT Wedding Deal: పెళ్లి ఓటీటీ స్ట్రీమింగ్కి  ‘NO’ చెప్పిన విజయ్-రష్మిక.. రూ.60 కోట్ల ఆఫర్‌ రిజెక్ట్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో వారం రోజుల్లో ఏడడుగులు వేయబోతున్నారు. ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని చారిత్రాత్మక ఉదయ్‌పూర్ ప్యాలెస్లో విజయ్ రష్మికల వివాహం జరగనుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వారం రోజుల వేడుకలు:

ఫిబ్రవరి 20వ తేదీ నాటికే ఇరు కుటుంబ సభ్యులు ఉదయ్‌పూర్ చేరుకుంటారని, 22వ తేదీ నుండి హల్దీ, మెహందీ, సంగీత్ వంటి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయని సమాచారం.. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరగనుంది. క్లారిటీ రావాల్సి ఉంది.

రూ.60 కోట్ల భారీ OTT ఆఫర్‌ రిజెక్ట్?

ఈ వివాహానికి సంబంధించి మరో క్రేజీ న్యూస్ కూడా టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం వివాహ వీడియో హక్కుల కోసం రూ.60 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. పెళ్లి వేడుకల పూర్తి చిత్రీకరణ, తెరవెనుక క్షణాలు, ప్రత్యేక ఇంటర్వ్యూలతో ఒక ప్రత్యేక డాక్యుమెంటరీగా రూపొందించాలనే ప్రతిపాదన వచ్చిందని సమాచారం.

అయితే ఈ భారీ ఆఫర్‌ను విజయ్-రష్మిక జంట తిరస్కరించిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వివాహ జ్ఞాపకాలు వ్యక్తిగతమైనవి, అమూల్యమైనవని భావించి వాణిజ్య ప్రయోజనాల కంటే గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, నెట్ఫ్లిక్స్ డీల్ మాట్లాడినట్లుగా టాక్!

సెలబ్రిటీ వెడ్డింగ్ ట్రెండ్ మధ్య ప్రత్యేక నిర్ణయం..

ఇటీవలి కాలంలో ప్రముఖుల వివాహాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు లాభదాయకమైన కంటెంట్‌గా మారాయి. తమిళ సూపర్ స్టార్ నయనతార-డైరెక్టర్ విగ్నేష్ శివన్ వివాహం స్ట్రీమింగ్ స్పెషల్‌గా మారిన తర్వాత ఇలాంటి ప్రాజెక్టులపై ప్లాట్‌ఫామ్‌లు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే విజయ్-రష్మిక జంట తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

అధికారిక ప్రకటనపై ఆసక్తి

గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమాయణంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, ఈ జంట ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పెళ్లి తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు అందరి చూపు అధికారిక ప్రకటనపై నిలిచింది. నిజంగా ఈ స్టార్ జంట ఫిబ్రవరి 26న ఏడడుగులు వేయబోతున్నారా? లేక ఇవన్నీ కేవలం ప్రచారమా? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.

హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్

పెళ్లి వేడుక రాజస్థాన్‌లో ముగిసిన తర్వాత, హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో మార్చి 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులకు ఈ వేడుకకు ఆహ్వానాలు అందనున్నాయి. వైరల్ అవుతున్న ఆహ్వానం కార్డులో  "మీ అందరి ప్రేమ, ఆశీస్సులతో నేను, రష్మిక ఫిబ్రవరి 26న వివాహం చేసుకోబోతున్నాం. మా ప్రయాణంలో భాగమైన మీ అందరి సమక్షంలో ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. మార్చి 4న తాజ్ కృష్ణలో జరిగే రిసెప్షన్‌కు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించండి." అని  విజయ్ దేవరకొండ పేరులో ఆహ్వాన పత్రిక ఉంది.