నిర్మాతగా నిత్యామీనన్.. కేయూరి ప్రొడక్షన్స్ లాంచ్..

నిర్మాతగా నిత్యామీనన్.. కేయూరి ప్రొడక్షన్స్ లాంచ్..

నటిగా ఎన్నో వైవిధ్యభరిత పాత్రలతో ఆకట్టుకున్న నిత్యామీనన్.. తన కెరీర్‌‌లో సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కేవలం నటనకే పరిమితం కాకుండా, ఇకపై సినిమాలను నిర్మించేందుకు ఆమె సిద్ధమయ్యారు.  ‘కేయూరి ప్రొడక్షన్స్’ పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ఆమె అధికారికంగా ప్రారంభించారు. కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాలను, కొత్త ఆలోచనలతో వచ్చే దర్శకులను ప్రోత్సహించడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశమని నిత్యామీనన్ తెలియజేశారు. 

‘సినిమా అంటే నాకు కేవలం వృత్తి మాత్రమే కాదు, నా ప్రాణం. ఎప్పటి నుంచో నిర్మాణ రంగంలోకి రావాలని భావిస్తున్నాను. ఈ సంస్థ ద్వారా నాకు నచ్చిన, సమాజానికి ఏదైనా చెప్పే మంచి కథలను తెరపైకి తీసుకువస్తాను’ అని నిత్యామీనన్ అన్నారు. కేవలం కమర్షియల్ అంశాలకే కాకుండా, కళాత్మక విలువలకు   ప్రాధాన్యత ఇస్తానని ఆమె వెల్లడించారు.  తన బ్యానర్‌‌లో రాబోతున్న తొలి సినిమా వివరాలను త్వరలో ఆమె రివీల్ చేయనున్నారు.