ఆకలైతాంది బామ్మ..!

ఆకలైతాంది బామ్మ..!
  • ఐదు రూపాయలకే ప్లేటు ఇడ్లీ, దోశ
  • సోషల్ మీడియాలో బెంగళూరు బామ్మ వీడియో వైరల్

ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ బామ్మ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకు ఇప్పటికే 5 మిలియన్  వ్యూస్ రాగా, 6 లక్షల లైకింగ్స్, వందల కొద్దీ కామెంట్స్ వచ్చాయి. ఇంతకు ఆ బామ్మ ఏం చేసి సోషల్ మీడియాలో కెక్కిందనే కదా మీ డౌట్..! అయితే చదవండి మరి. బెంగళూరు నగరంలోని విశ్వేశ్వరపురానికి చెందిన 60 ఏళ్ల బామ్మ 30 ఏళ్లుగా  ఐదు రూపాయలకే ప్లేటు ఇడ్లీ, దోశ అందిస్తూ ఎంతోమంది అన్నార్థుల ఆకలి తీరుస్తోంది. ఆకలైతాంది బామ్మ అంటే 'రామ్మా' అంటూ ప్రేమగా కస్టమర్లను ఆహ్వానిస్తోంది. అలా వచ్చినవాళ్లకు తనే దగ్గరుండి వేడి వేడి ఇడ్లీలు, దోశలు వడ్డిస్తుంటుందీ బామ్మ. బామ్మ ఈ టిఫిన్ సెంటర్ని తన ఇంటిముందే నడుపుతూ.. 5 రూపాయలకే టేస్టీ ఇడ్లీలు, దోశలు అందిస్తోంది. దీంతో కస్టమర్లు ఎగబడి తింటున్నారు. ఇక్కడ టిఫిన్ చేస్తుంటే  తమ ఇంట్లో తిన్నట్టు ఉంటదని కస్టమర్లు అంటుంటే ఆనందంగా ఉంటుందని బామ్మ చెబుతోంది. ఇలా పింఛన్ తీసుకునే వయసులో కూడా పని చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోందీ బామ్మ. "యూ ఆర్ రియల్లీ గ్రేట్ బామ్మ" అంటూ తెగ పొగిడేస్తున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి..

పంతం నెగ్గించుకున్న కర్ణాటక రైతు.. ఇంటికే వెళ్లి వాహనం డెలివరీ

బాలీవుడ్ అందాల తార  కాజోల్కు కరోనా