రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం : శాంతి కుమారి

 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం : శాంతి కుమారి

 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జూన్ 2న ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు సీఎస్ శాంతికుమారి. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలవుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జూన్ 2న ఉదయం 9 గంటల నుండి అవతరణ దినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పారు. 

జూన్ 2 సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి అనేక స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ అవతరణ వేడుకల్లో పాల్గొనడంతో పాటు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయనున్న సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. జూన్ 2న సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.