ఎఫ్​డీఐలో మనమే టాప్​

ఎఫ్​డీఐలో మనమే టాప్​
  • 1200 మంది బిజినెస్​లీడర్లతో డెలాయిట్​ సర్వే
  • టెక్స్​టైల్​, ఫార్మా, ఎలక్ట్రానిక్స్​లో పెట్టుబడులకు ఛాన్స్​
  • ఈజ్​ ఆఫ్​ డూయింగ్​ బిజినెస్​లో దేశం ముందడుగు
  •  సంస్కరణలూ భేష్​

న్యూఢిల్లీ: ఫారిన్​ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్లకు మన దేశమే ఎట్రాక్టివ్​గా నిలుస్తోంది. ఎకనమిక్​ గ్రోత్​కు అవకాశముండటంతోపాటు, నిపుణులైన వర్క్​ఫోర్స్​ వల్లే మన దేశంలో పెట్టుబడులకు విదేశీ కంపెనీలు ఇష్టపడుతున్నాయి. షార్ట్​ టర్మ్​, లాంగ్​ టర్మ్​లు రెండింటిలోనూ ఇండియాలో గ్రోత్​కు మెరుగైన అవకాశాలున్నాయని పెద్ద పెద్ద బిజినెస్​ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వారు వాటిని పెంచుతామని చెబుతున్నారని, కొత్తగా పెట్టాలనుకునే వారూ ముందుకొస్తున్నారని డెలాయిట్​ సర్వేలో తేలింది. యునైటెడ్​ స్టేట్స్​ ఆఫ్​ అమెరికా, యునైటెడ్​ కింగ్​డమ్​, జపాన్​, సింగపూర్​లలోని మల్టీ నేషనల్​ కంపెనీలకు చెందిన 1200 మంది బిజినెస్​ లీడర్లతో ఈ సర్వే నిర్వహించినట్లు డెలాయిట్​ వెల్లడించింది. ఇండియాస్​ ఎఫ్​డీఐ ఆపర్చునిటీ పేరిట ఈ సర్వేను నిర్వహించినట్లు తెలిపింది.
మన దేశంలో డిజిటైజేషన్​, కస్టమ్స్​ క్లియరెన్స్​, మాన్యుఫాక్చరింగ్​ రంగానికి ఇస్తున్న  ప్రొడక్షన్​ లింక్డ్​ ఇన్సెంటివ్స్​ వంటి అంశాలపై జపాన్​లోని 16 శాతం బిజినెస్​ లీడర్లకు, సింగపూర్​లోని 9 శాతం బిజినెస్​ లీడర్లకు మాత్రమే అవగాహన ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. దాంతో చైనా, వియత్నాంలతో పోల్చినప్పుడు ఇండియాలో వ్యాపారం కష్టతరమనే అభిప్రాయం వారిలో ఉందని రిపోర్టు పేర్కొంది. అయితే, రాజకీయ–ఆర్థికపరమైన కోణంలో మాత్రం ఇండియాను ఇష్టపడుతున్నారని,   అయితే రెగ్యులేటరీపై క్లారిటీలేదని చెబుతున్నారని డెలాయిట్​ రిపోర్టు వెల్లడించింది. ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ మెరుగ్గా లేదనే అంశాన్నీ ఇన్వెస్టర్లు లేవనెత్తుతున్నట్లు పేర్కొంది. ఈజ్​ ఆఫ్​ బిజినెస్ పట్ల ఇండియా చూపిస్తున్న శ్రద్ధ మరిన్ని మెరుగయిన ఫలితాలను తెస్తుందనే విశ్వాసం తమకు ఉందని డెలాయిట్​ గ్లోబల్​ సీఈఓ పునీత్​ రంజన్​ చెప్పారు. ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు, సంస్కరణలనూ ఇండియా తెస్తోందని పేర్కొన్నారు. 

7 రంగాల్లో ఎన్నో అవకాశాలు 
ఏడు రంగాలలో ఎఫ్​డీఐలను ఆకర్షించేందుకు మన దేశంలో అవకాశాలున్నాయి. టెక్స్​టైల్​ అండ్​ అపారెల్​, ఫుడ్ ప్రాసెసింగ్​, ఎలక్ట్రానిక్స్​, ఫార్మాస్యూటికల్స్​, వెహికల్స్​ అండ్​ పార్ట్స్​, కెమికల్స్​, క్యాపిటల్​ గూడ్స్​ రంగాలలో భారీగా విదేశీ పెట్టుబడులకు ఛాన్స్​ ఉంటుందని అంచనా. 2020–21లో ఈ ఏడు రంగాలూ కలిపి మొత్తం 181 బిలియన్​ డాలర్ల విలువైన ఎగుమతులు నిర్వహించాయి. పై ఏడు రంగాలలో ఎదగడానికి తగిన పరిస్థితులు ఉన్నాయని, తొందరగా ఫలితాలు కూడా రాబట్ట వచ్చని డెలాయిట్​ సర్వే రిపోర్టు వెల్లడించింది. ఎగుమతుల కోసమే ఇండియాలో  తయారు చేయడం కాకుండా, ఇండియాలోనే వినియోగం కోసమూ పెట్టుబడులు పెట్టాలని జపాన్​లోని బిజినెస్​ లీడర్లు భావిస్తున్నారు. చైనా, బ్రెజిల్​, మెక్సికో, వియత్నాం వంటి మార్కెట్లతో పోలిస్తే యూఎస్​లో ఇండియాపైనే మంచి అభిప్రాయం ఉందని ఈ రిపోర్టు తెలిపింది. యూఎస్​, యూకేలలోని బిజినెస్ లీడర్లు మన దేశం వైపే మొగ్గుచూపుతున్నట్లు పేర్కొంది. అయితే జపాన్​, సింగపూర్​లలోని బిజినెస్​ లీడర్లు మాత్రం వియత్నాంకు పెద్ద పీట వేస్తున్నట్లు వివరించింది. ఈజ్​ ఆఫ్​ డూయింగ్​ బిజినెస్​ను మెరుగుపరచడంపై మన దేశం చేస్తున్న ప్రయత్నాలకు ప్రశంసలు వస్తున్నాయని తెలిపింది.