
జాత్యహంకార ఆరోపణలపై ఐకియా స్పందించింది. జాత్యహంకారం సహా పక్షపాతాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఐకియా స్టోర్ల వద్ద సమానత్వం అనేది మానవహక్కు అని తాము విశ్వసిస్తామని తెలిపింది. కస్టమర్ కు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చెప్పింది. రెండుసార్లు ఛార్జ్ చేయడం, ఉత్పత్తులను మళ్లీ మళ్లీ స్కాన్ చేయడం వంటి వాటికి సంబంధించి కస్టమర్లు ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోరంటూ ఐకియా తెలిపింది.
Hej, at IKEA, we believe that equality is a human right, and we condemn all forms of racism and prejudice. We regret the inconvenience caused to you while following the mandatory billing protocol. (1/3)
— IKEAIndia (@IKEAIndia) August 28, 2022
ఇటీవల నితిన్ సేతి అనే వ్యక్తి హైదరాబాద్ లోని ఐకియా స్టోర్లో జరిగిన జాత్యహంకారంపై ట్విట్ చేశారు. తన భార్య కొనుగోలు చేసిన వస్తువులను సిబ్బంది తనిఖీ చేశారని, అంతకు ముందు, ఆ తర్వాత కొనుగోలు చేసిన కస్టమర్లను మాత్రం చెక్ చేయలేదని ఆరోపించాడు. దీనికి కారణం కేవలం జాతి వివక్షేనని.. సూపర్‌వైజరీ స్టాఫ్ కూడా ఈ చర్యకు మద్దతుగా నిలిచారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంటర్నేషనల్ స్టోర్ తన బుద్ధి చూపించుకుందని మండిపడ్డారు. దీనికి తోడు రేసిజం అనే హాష్‌టాగ్ ను కూడా జోడించారు. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ఐకియా స్టోర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
This is appalling and absolutely unacceptable @IKEAIndia
— KTR (@KTRTRS) August 29, 2022
Please ensure a proper apology is issued & more importantly educate, sensitise & train your staff to respect all your customers graciously
Hope you will make amends asap https://t.co/l84GimoIrM
హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌లో జాత్యహంకార వివక్ష జరిగిందన్న వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ చర్య భయంకరమైనదని, ఆమోదయోగ్యం కానిదని పేర్కొన్నారు. దయచేసి క్షమాపణను కోరండి అంటూ కేటీఆర్ సూచించారు. తమ స్టోర్ కి వచ్చిన కస్టమర్లతో ఎలా ఉండాలి, వారితో ఎలా ప్రవర్తించాలి అన్న విషయంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కేటీఆర్ ఈ సందర్భంగా రాసుకొచ్చారు. ఐకియా స్టోర్స్ వారు తమ పద్దతి మార్చుకుంటే చాలా మంచిదని ట్వీట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌లో జాత్యహంకార వివక్ష ఎదుర్కొన్నట్టుగా ఓ వ్యక్తి ట్వీట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.