దానం నాగేందర్ ను కోవర్టుగానే భావిస్తాం : రాజు యాదవ్

దానం నాగేందర్ ను  కోవర్టుగానే భావిస్తాం :  రాజు యాదవ్

ఢిల్లీ: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేయకుండా పోటీ చేస్తే అతడిని కోవర్టు ఆనే భావిస్తామని కాంగ్రెస్ నేత రాజు యాదవ్ చెప్పారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు రాజు యాదవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..పార్టీలు మారి వచ్చిన నేత రేపు గెలిస్తే మళ్లీ మారడని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చినందున తాము వ్యతిరేకించడం లేదని, దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. దానంపై అనర్హత ఓటు వేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ కు ఫిర్యాదు చేశానని చెప్పారు. రాజీనామా చేయకుండా పోటీలో నిలిస్తే తాము అతడిని కోవర్టుగానే భావిస్తామని చెప్పారు.