
ఎల్బీనగర్, వెలుగు: గంజాయి అడిగితే లేదన్న ఇద్దరిని దుండగులు చితకబాదారు. ఈ ఘటన ఓల్డ్ సిటీ భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి విక్రయించే షాబాజ్, అతని స్నేహితుడు ఫయీమ్ వద్దకు శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు వచ్చారు.
గంజాయి కావాలని అడిగారు. వారు తాము విక్రయించడం లేదని చెప్పడంతో బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని బండ్లగూడ వైపు నుంచి తలాబ్ కట్ట వరకు తీసుకెళ్లి చితకబాదారు. బాధితులు తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, ఆటోను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారి కోసం వెతుకుతున్నట్లు పేర్కొన్నారు.