మెడికల్ ఎడ్యుకేషన్ లో పారదర్శకత తీసుకొచ్చాం

మెడికల్ ఎడ్యుకేషన్ లో పారదర్శకత తీసుకొచ్చాం

న్యూఢిల్లీ  : 21వ శతాబ్దంలో మరింత ముందుకు పోయేలా కొత్త శిక్షా విధానం తెచ్చామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. భారత్ ను హయ్యర్ ఎడ్యుకేషన్ గ్లోబల్ హబ్ గా మార్చేందుకు.. మన యువతలో పోటీతత్వం పెంచేందుకు.. కృషి చేస్తున్నామని చెప్పారు. మైసూర్ యూనివర్సిటీ సెంటినరీ కాన్వకేషన్ కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు ప్రధాని. మైసూరు యూనివర్సిటీ భవిష్య భారత ఆకాంక్షలు నెరవేర్చే కేంద్రమన్నారు.

దేశ నిర్మాణంలో భాగస్వామ్యులైన ఎందరినో ఈ యూనివర్సిటీ అందించిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక విద్యకు ప్రాధాన్యమిచ్చామన్న మోడీ.. 2014 తర్వాత దేశంలో ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ లు పెంచామన్నారు. మెడికల్ ఎడ్యుకేషన్ లో పారదర్శకత తీసుకొచ్చామని తెలిపారు మోడీ.