ఒకే ఒక్క కోరిక.. అతడు చావాలి..! క్రిస్మస్ సందేశంలో జెలెన్‌‌‌‌స్కీ

ఒకే ఒక్క కోరిక.. అతడు చావాలి..! క్రిస్మస్ సందేశంలో జెలెన్‌‌‌‌స్కీ

కీవ్: క్రిస్మస్ వేడుకల సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‎పై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్​స్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుతిన్ పేరు ప్రస్తావించకుండానే ఆయన చనిపోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. క్రిస్మస్​సందర్భంగా జెలెన్​ స్కీ ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు.  ‘ఈరోజు మనందరికీ ఒకే ఒక్క కోరిక ఉంది, అతడు నశించాలి. ప్రతి ఒక్కరూ ఇదే కోరుకుంటున్నారు’ అని అన్నారు. రష్యా ఎన్ని దాడులు చేసినా ఉక్రెయిన్ ప్రజల హృదయాలను, ఐక్యతను నాశనం చేయలేదన్నారు. దేవుడి అండ లేని వాళ్లు ఉక్రెయిన్​పై దాడులు చేస్తున్నారని, శాంతి కోసం దేశ ప్రజలంతా ప్రార్థిస్తున్నారని చెప్పారు.