పునర్విభజనపై పునరాలోచించాలి.. ఏర్పాటు చేసిన వాటిని తీసేస్తే సమస్యలు వస్తాయి

పునర్విభజనపై  పునరాలోచించాలి.. ఏర్పాటు చేసిన వాటిని తీసేస్తే సమస్యలు వస్తాయి
  • మహబూబ్​నగర్​ ఎంపీ డీకే అరుణ

మహబూబ్​నగర్​ అర్బన్​, వెలుగు: కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, జిల్లాల తొలగింపు, పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని మహబూబ్​నగర్​ ఎంపీ డీకే అరుణ సూచించారు. ఒకసారి జిల్లాలుగా ఏర్పాటు చేసిన తర్వాత వాటిని తీసేస్తే సమస్యలు వస్తాయన్నారు.

 అందుకే ఈ అంశంపై పునరాలోచించాలన్నారు. అవసరమైతే ఆల్​ పార్టీ మీటింగ్​ ఏర్పాటు చేసి, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలన్నారు. మహబూబ్​నగర్​లోని బీజేపీ జిల్లా పార్టీ ఆఫీసులో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 

గత బీఆర్ఎస్​ ప్రభుత్వం హయాంలో లీడర్లు కేంద్రం నిధులను దుర్వినియోగం చేశారని, ప్రస్తుత కాంగ్రెస్  ప్రభుత్వంలోని లీడర్లు వారి జేబులు నింపుకోవడానికే కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. మహాత్మా గాంధీ పలికిన హే రామ్ జీ పేరుతో జీ రామ్ జీ పథకం తీసుకొస్తే కాంగ్రెస్  లీడర్లకు ఎందుకు కడుపు మండుతోందన్నారు.