ప్రజల కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకోవాలి

ప్రజల కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకోవాలి

ప్రతిపక్షాలు గెలవకూడదని తామెప్పుడూ అనుకోలేదని అన్నారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అయితే 40 ఏళ్లలో ఎప్పుడూ ఇంతగా వన్ సైడ్ ఎన్నికలు చూడలేదని చెప్పారు. వరుసగా ప్రతి ఎన్నికల్లో కేసీఆర్‌ని గెలిపించుకోవాలని ప్రజలు ఓట్లేస్తున్నారని అన్నారు. సీఎం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని చెప్పారు మంత్రి. కేసీఆర్, కేటీఆర్ ఉంటేనే మంచి జరుగుతుందని ఓటర్లు నమ్ముతున్నారని అన్నారు.  ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 మున్సిపాలిటీల్లో ప్రజల కాళ్లు కడిగి నేతలు నెత్తినపోసుకోవాలన్నారు ఎర్రబెల్లి. ప్రజలు తమకు కట్టబెట్టిన విజయంతో తమపై బాధ్యత పెరిగిందని చెప్పారాయన. కష్టపడి పని చేసి వారి రుణం తీర్చుకుంటామని చెప్పారు. ఈ గెలుపు స్ఫూర్తిగా రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు.