హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లాలా..? కాచిగూడ-తిరుపతి రూట్లో స్పెషల్ ట్రైన్స్

హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లాలా..? కాచిగూడ-తిరుపతి రూట్లో స్పెషల్ ట్రైన్స్

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పలు రూట్లలో 48 స్పెషల్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. కాచిగూడ-తిరుపతి మధ్య 8 స్పెషల్ ట్రైన్లు, నరసాపూర్-తిరువణ్ణమలై రూట్లో 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి-హిసార్ మధ్య 12 స్పెషల్ రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు జులై 9 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు రాకపోకలు సాగించనున్నట్లు SCR (South Central Railway) తెలిపింది. ఈ స్పెషల్ ట్రైన్లలో ప్రయాణించాలనుకుంటే అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక రైళ్ల రాకపోకల షెడ్యూల్ దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు.

కాకినాడ-లింగంపల్లి, కాకినాడ-చర్లపల్లి రూట్లలో వారానికి మూడురోజులు స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. కాకినాడ టౌన్-చర్లపల్లి (07447) రైలు జూలై 5, 2025 నుంచి.. మార్చి 28, 2026 వరకు, చర్లపల్లి - కాకినాడ టౌన్ (07448) రైలు జూలై 6 నుంచి మార్చి 29, 2026 వరకు నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. కాకినాడ టౌన్-లింగంపల్లి (07445) రైలు జూలై 2, 2025 నుంచి మార్చి 30, 2026 వరకు నడుస్తుందని.. లింగంపల్లి - కాకినాడ టౌన్ (07446) రైలు జూలై 3, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు నడుస్తుందని రైల్వే శాఖ పేర్కొంది.ఈ ప్రత్యేక రైళ్లలో 1AC, 2AC, 3AC, 3AC ఎకానమీ, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ -క్లాస్ కోచ్‌లు ఉంటాయి.