
వరంగల్లో బీరన్న బోనాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రి కొండా సురేఖ బోనాల వేడుకకు హాజరయ్యారు. బోనమెత్తి ఆమె మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. వరంగల్లో తొలి బోనం బీరన్నకే కావడం సంతోషంగా ఉందన్నారు. బోనం ఎత్తడం ఒక ప్రత్యేకత అయితే.. ఇక్కడ గొర్రెను కురమ పూజారులు గావ్ పట్టడం మరో ప్రత్యేకత అన్నారు.
రాష్ట్రంలో మొదటి బోనం వరంగల్ భద్రకాలిదే అనుకున్నా.. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సంకల్పం ఆగిందన్నారు. సోషల్ మీడియా ప్రచారం ఆ అంశంపై ప్రభావం చూపించిదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బోనాల జాతరకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహయ సహకారాలు అందుతున్నాయని తెలిపారు.