Operation Sindoor: అమాయకులను చంపిన వారినే మట్టుబెట్టాం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

Operation Sindoor: అమాయకులను చంపిన వారినే మట్టుబెట్టాం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్ తో చరిత్ర సృష్టించామని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత సైన్యం లక్ష్యం పాక్ పౌరులు కాదనీ, అమాయకులను చంపిన వారినే మట్టుబెట్టామని అన్నారు. దేశ భద్రతకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని పాక్ ను హెచ్చరించారు. ఈ ఆపరేషన్ తో  మన సైనిక సత్తా ఏంటో చూపించామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ను సక్సెస్ చేసిన భద్రతా బలగాలకు దేశం తరఫున సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం (మే 7) బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్  ను ప్రారంభించిన సందర్భంగా ఆపరేషన్ సిందూర్ పై మాట్లాడారు. ఈ కారక్రమంలో 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి 50 మౌళిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. 

ఆపరేషన్ సిందూర్ ను కచ్చితమైన సమాచారంతో ఆపరేషన్ చేపట్టామని రక్షణమంత్రి అన్నారు. లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించామని, ఉగ్రవాద నిర్మూలనపై పాకిస్తాన్ కు క్లియర్ మెసేజ్ ఇచ్చామని అన్నారు. 
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో లక్ష్యాన్ని సాధించామని, సైన్యానికి ఫ్రీ హ్యండ్ ఇచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. 

పాకిస్తాన్ కవ్వింపు చర్యలను, ఉగ్రవాదుల దాడుల వైఖరికి తీవ్ర స్థాయిలో బుద్ధి చెప్పామని ఈ సందర్భంగా రాజ్ నాథ్ అన్నారు. ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్న సంస్థలకు బుద్ధి చెప్పామని, రైట్ టు రెస్పాండ్ హక్కును వినియోగించుకున్నాం చెప్పారు. 

2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు  నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. బైసారన్ మైదాన ప్రాంతంలో టూరిస్టులను ఊచకోత కోశారు ఉగ్రవాదులు. ముష్కరులు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో 26 మంది అమాయక టూరిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడికి భారత్ రివేంజ్ తీర్చుకుంది.

►ALSO READ | భారత్‎కు యుద్ధం చేసే ఆలోచన లేదు.. కానీ పాక్ రెచ్చగొడితే తొక్కిపడేస్తాం: అజిత్ దోవల్

పహల్గాం ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న భారత్.. పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించింది. చెప్పినట్లుగానే 2025, మే 6  మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)తో పాటు పాక్‌లోని టెర్రరిస్ట్‌ స్థావరాలపై ఇండియన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌ విరుచుకుపడింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన ఈ కౌంటర్ ఎటాక్‎లో లష్కరే తోయిబా, జైషీ మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన దాదాపు 90 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. భారత్ ఆపరేషన్ సిందూర్ తో దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య హై టెన్షన్ వాతావరణం నెలకొంది.