బైక్ చలాన్లను మేమే కట్టుకుంటాం: బండి సంజయ్

బైక్ చలాన్లను మేమే కట్టుకుంటాం: బండి సంజయ్

హైదరాబాద్ నగరవాసులకు కీలక హామీలిచ్చింది బీజేపీ. గ్రేటర్ లో బీజేపీ విజయం సాధిస్తే.. వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు రూ.25 వేల చొప్పున సాయం అందజేస్తామని ప్రకటించింది. గురువారం మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీనికి సంబంధించి హామీ ఇచ్చారు. ఏ ఇంటికి ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి.. కేంద్రం నుంచి నిధులు రప్పిస్తామన్నారు.

చలాన్ల పేరుతో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. బైక్ పై ముగ్గురు యువకులు వెళ్తే చలాన్లు విధిస్తున్నారని తెలిపారు. బీజేపీ GHMC మేయర్ పదవిని చేపట్టిన తర్వాత.. హైదరాబాద్ పరిధిలో వసూలు చేసిన చలాన్లను మొత్తం మేమే కడతామన్నారు. చలాన్ల కారణంగా ఎక్కువగా యువకులే ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఓల్డ్ సిటీలో ఎన్ని చలాన్లు వసూలు చేస్తున్నారు.. అక్కడి వాళ్లే మనుషులు.. బయటి వాళ్లు కాదా అని ప్రశ్నించారు. GHMC లో బీజేపీ గెలిస్తే సీఎం దిగొస్తారన్నారు.

మందు పే చర్చ కావాలా.. ఛాయ్ పే చర్చ కావాలా.. ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు సంజయ్. ఉగ్రవాదులను పెంచి పోషించే హైదరాబాద్ కావాలా.. దేశభక్తులకు నిలయమైన హైదరాబాద్ కావాలో తేల్చుకోవాలన్నారు.