ఇండియాకు ఉక్రెయిన్ క్షమాపణ.. భారత సంస్కృతిని గౌరవిస్తామని వెల్లడి

ఇండియాకు ఉక్రెయిన్ క్షమాపణ.. భారత సంస్కృతిని గౌరవిస్తామని వెల్లడి

కాళీ మాత చిత్రాన్ని పోలి ఉండేలా ట్విట్టర్ లో పోస్టులు చేసిన ఉక్రెయిన్ రక్షణ శాఖ.. తాజాగా క్షమాపణలు చెప్పింది. అధికారిక ట్విట్టర్ ఖాతాలో హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోను గుర్తుకు తెచ్చేలా ‘వర్క్ ఆఫ్ ఆర్ట్’ అనే క్యాప్షన్‌తో ఏప్రిల్ 30న ఓ చిత్రాన్ని షేర్ చేసింది. ఈ ఫొటోలో పైకి లేస్తున్న స్కర్ట్‌తో ఉన్న స్త్రీ ఉంది. కానీ ఈ స్ర్తీ డ్రెస్సింగ్ అంతా కూడా హిందూ దేవత మహంకాళీ అవతారాన్ని పోలి ఉంది. దీంతో ఇండియన్ నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ జోక్యం చేసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ విమర్శల నేపథ్యంలో పోస్టు చేసిన ఇమేజ్ ను ఉక్రెయిన్ రక్షణ శాఖ తమ ట్విట్టర్ ఖాతా నుంచి డిలీట్ చేసింది.

తాజాగా ఉక్రెయిన్ ఉప విదేశాంగ శాఖ మంత్రి ఎమినే జెపర్ ట్విట్టర్ వేదికగా ఇండియాకు క్షమాపణలు చెప్పారు. కాళీ దేవిని తప్పుగా చూపేలా ట్వీట్ చేసినందుకు రిగ్రేట్ గా ఫీలవుతున్నట్టు తెలిపారు. భారతీయ సంప్రదాయాలను ఉక్రెయిన్ ఎప్పుడూ గౌరవిస్తుందని, మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

https://twitter.com/EmineDzheppar/status/1653109804393455632