సోనియా గాంధీని..మేమూ గౌరవిస్తాం

సోనియా గాంధీని..మేమూ గౌరవిస్తాం
  •  ఇక్కడి నుంచి ఆమె ఎంపీగా పోటీ చేస్తే మా అభ్యర్థినీ నిలబెడ్తం: కర్నే ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా సోనియా గాంధీని గౌరవిస్తా మని మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ అన్నారు. ఆమె ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తే తమ పార్టీ నుంచి కూడా అభ్యర్థిని నిలబెడ్తామని వెల్లడించారు. బుధవారం తెలంగాణ భవ న్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాం తాచారి తల్లి శంకరమ్మను హుజూర్​నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెడితే, ఆమెపై అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పోటీ చేయ లేదా? అని ప్రశ్నించారు. సోనియాను బలి దేవత అన్నదే రేవంత్ అని గుర్తుచేశారు.

అసెంబ్లీ ఎన్నికల హామీలు అమలు చేయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేయాలని రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ను కాంగ్రెస్ లీడర్లు ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అరువు తెచ్చుకున్న నాయకుడు.. రేవంత్ అని విమర్శించారు. కాం గ్రెస్ ప్రభుత్వం కార్మికుల గొంతు కోస్తున్నదని మాజీ ఎమ్మెల్యే కోరుంటి చందర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికుల కనీస వేతనం రూ.18,019లుగా నిర్ణయిస్తే.. రేవంత్ ప్రభు త్వం దాన్ని రూ.11,770గా నిర్ణయించారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన జీవోనే అమలు చేయాలన్నారు.