టార్గెట్ కంప్లీట్ చేయని మిల్లులను సీజ్​చేస్తాం : జితేశ్.వి.పాటిల్

టార్గెట్ కంప్లీట్ చేయని మిల్లులను సీజ్​చేస్తాం : జితేశ్.వి.పాటిల్
  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్.వి.పాటిల్ హెచ్చరిక

కామారెడ్డి, వెలుగు: ఎఫ్​సీఐకు అందించాల్సిన సీఎంఆర్ టార్గెట్ ను నెలాఖరు లోగా పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్​జితేశ్.వి.పాటిల్ రైస్​మిల్లర్లను ఆదేశించారు. టార్గెట్ కంప్లీట్ చేయని మిల్లులను సీజ్​చేసి, ఓనర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్​లో మిల్లర్లు, సంబంధిత ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్​జితేశ్​మాట్లాడుతూ.. మిల్లర్లు రోజువారీ టార్గెట్లు పెట్టుకోవాలని సూచించారు. డెయిలీ ప్రతి మిల్లునూ డిప్యూటీ తహసీల్దార్​పరిశీలించి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. మీటింగులో అడిషనల్​ కలెక్టర్​చంద్రమోహన్,  డీఎస్ఓ మల్లిఖార్జునబాబు, డీఎం అభిషేక్​సింగ్​తదితరులు పాల్గొన్నారు.ఎలాంటి తప్పులు లేకుండా అభయహస్తం అప్లికేషన్లను ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలని కామారెడ్డి కలెక్టర్​జితేశ్.వి.పాటిల్ ఆదేశించారు. మంగళవారం రాజంపేట మండల కేంద్రంలో కొనసాగుతున్న అప్లికేషన్ల ఎంట్రీని ఆయన పరిశీలించారు.