కుల, మతాల పేరుతో రెచ్చగొట్టే పార్టీలపై పోరాటం చేయాలి

కుల, మతాల పేరుతో రెచ్చగొట్టే పార్టీలపై పోరాటం చేయాలి

విద్యా క్షేత్రంగా, సరస్వతి నిలయంగా సిద్దిపేట మారనుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట పట్టణంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.... 75 సంవత్సరాల క్రితం రాచరిక పాలనలో ఉన్న దేశానికి గాంధీ లాంటి వాళ్లు పోరాటం చేసి స్వతంత్రం తెచ్చారన్నారు. 3 రోజుల పాటు వజ్రోత్సవాలు జరపాలని మన చరిత్ర మన పిల్లలకు తెలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విధమైన పిలుపునిచ్చారని తెలిపారు. ఈ మధ్య కొన్ని శక్తులు రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నాయన్న మంత్రి... మతాల పేరిట విద్వేషాలు రెచ్చకొట్టి మత సామరస్యంతో కోట్లు పెట్టి పబ్బం గడుపుతున్నాయని చెప్పారు. మతాలు, కులాల పేర రెచ్చగొట్టే పార్టీలపై పోరాటం చేయాలని, నవ తెలంగాణ కోసం అందరం కలిసి ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. 

973 రెసిడెన్షియల్ స్కూల్స్ లో 4 లక్షల 75 వేల మంది పేద పిల్లలకు సన్న బియ్యంతో పెడుతూ, ఉచిత విద్యనందిస్తున్నామని హరీష్ రావు అన్నారు. రానున్న రోజుల్లో వెటర్నరీ చుదువుల కోసం కాలేజీని ప్రారంభిస్తామన్నామని తెలిపారు. కొంత మందిని చూస్తే బాధనిపిస్తుందని, ఇక్కడికి వస్తే దేహశుద్ధి చేసి పంపిస్తారని చెప్పారు. ఇక్కడ పండుతున్న పంటలకు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టేనన్న మంత్రి.. ఒక్క ఎకరాకు కూడా పంటకు నీరు లేదు అనే వాళ్లను ఏం అనాలో తెలియడం లేదన్నారు. ప్రజల సుఖ సంతోషాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చేస్తుండని హరీష్ రావు తెలిపారు. ఒకప్పుడు పొట్ట కూటి కోసం ముంబయి, దుబాయ్ వెళ్లేవాళ్లు.. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుండి కూలీలు వచ్చి పనులు చేస్తున్నారన్నారు. ఆహార, ఆరోగ్య విషయాల కోసం సిద్దిపేట పట్టణంలో పెట్టిన మెడికల్ ఎక్స్ పో చూసి ఆరోగ్య విషయాలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.