తలకిందుల తపస్సు చేసినా మేయర్ సీటు ఎంఐఎంకు ఇవ్వం

తలకిందుల తపస్సు చేసినా మేయర్ సీటు ఎంఐఎంకు ఇవ్వం

మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని మేయర్ సీటును టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం తధ్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ సీటు మాదే..  తలక్రిందులు తపస్సు చేసిన… మేయర్ సీట్ ఎమ్.ఐ. ఎమ్.కి ఇవ్వబోమని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కి ఓటు వేస్తే… మేయర్ పదవి ఎమ్.ఐ. ఎమ్. కి కట్టపెడ్తారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాళ్లు అందరూ.. వివిధ పదవుల్లో ఉన్నారు.. బీజేపీ వారు తెలంగాణ ఉద్యమంలో చేసిందేముందో కానీ… ఇప్పుడు మాత్రం తెలంగాణకి  అన్యాయం చెయ్యాలనే చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రులు మాట్లాడే మాటలు వింటుంటే… ప్రజలకే ఆశ్చర్యం వేస్తుంది.. ‘‘తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు… అన్ని రాష్ట్రాలు ఫాలో కావాలని’’ అన్న కేంద్ర మంత్రులే ఇప్పుడు ఇలా మాట్లాడటం బాధాకరమన్నారు.

తెలంగాణ అభివృద్ధికి కృషి చేశారంటున్న కేంద్ర ప్రభుత్వం… ఇప్పటి వరకు ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆరున్నర ఏళ్లలో ఏ ప్రాజెక్ట్ తెలంగాణ కి ఇచ్చారో చెప్పాలి.. రైతులకి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో… వివరంగా చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని కూడా సరిగ్గా కాపీ కొట్టలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వానిది… జి.ఎస్.టి అమలు, నోట్ల రద్దు సహా అన్నింటికీ తెరాస ప్రభుత్వం సహకరించింది… తెరాస సహకారం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం… రాష్ట్రానికి చేసింది ఏమి లేదన్నారు. లోక్ సభలో సీఎం కేసీఆర్ ని ప్రధానమంత్రి పొగిడారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు.

2.72 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి వివిధ రూపాల్లో పన్నులు కడితే… రాష్ట్రానికి 1.4 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారని ఆరోపించారు.  పేరుకే ఫెడరల్ గవర్నమెంట్… తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కళ్లు మండుతున్నాయి… వివిధ పథకాలతో ప్రజలకు చేయూతనిస్తూ… అభివృద్ధి పథం పై తీసుకెళ్తున్నందుకు మాపై ఛార్జి షీట్ వేస్తామంటున్నారు. చేనేత, బిఎస్ఎన్ఎల్, ఓఎస్ జి లాంటి 26 సంస్థలను ప్రయివేటు పరం చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలపైనే ఛార్జిషీట్ వేయాలని ఆయన పేర్కొన్నారు.  ప్రతిగ్రామానికి నర్సరీ ఇచ్చాము, ఒక ట్రాక్టర్ ఇచ్చాము. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నాము.. 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నాం.. గ్రేటర్ ఎన్నికల్లో 54 శాతం అణగారిన వర్గాలకే రిజర్వేషన్ కల్పించాం..  ఇవన్నీ చూసి మీరు సిగ్గు పడాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

చైనా పై మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మా తెలంగాణ బిడ్డ చనిపోయాడు.  దీనిపై మీపై ఛార్జ్ షీట్ వేయాలి..   గడియకోసారి 144 సెక్షన్ విధిస్తున్నందుకు మీపైనే… ఛార్జ్ షీట్ వేయాలి.. కేసీఆర్, కేటీఆర్ లని తిడితే… మీకు ఓట్లు పడవు. అవన్నీ మాకే ప్లస్ అవుతాయి.. ఎన్నికలు దగ్గరకొచ్చిన కొద్దీ హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు… మతకలహాలు రేపాలని చూస్తోంది మీరేనని ఆయన ఆరోపించారు. మీరు తెలంగాణ ఉద్యమంలో చేసిందేముందో కానీ… ఇప్పుడు మాత్రం తెలంగాణకి  అన్యాయం చెయ్యాలనే చూస్తున్నారు.. దుబ్బాకలో సానుభూతి వల్లే గెలిచారు. దానికేతో జబ్బలు కొట్టుకుంటున్నారు..  దమ్ముంటే రఘునందన్ రావు ని సానుభూతి వల్ల గెలవలేదని చెప్పమనండి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాల్ చేశారు.

స్విస్ బాంక్ నుంచి డబ్బు తెచ్చి… అందరి అకౌంట్ లలో వేస్తామన్న కేంద్ర ప్రభుత్వం… దాని ఊసే ఎత్తట్లేదు..  దమ్ముంటే ముందు ఆ పని చేయండి. అప్పుడు మేమే మిమ్మల్ని పొగుడుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్  ప్రకటించారు. కేంద్ర మంత్రులకు నా విజ్ఞప్తి.. దయచేసి ఇక్కడ అల్లర్లు సృష్టించాలని చూడకండి.. ప్రజలని ప్రశాంతంగా ఉండనివ్వండి… ముందు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి..  దేశ రక్షణను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టకండి… శత్రు దేశాలపై  వైఖరిని మార్చుకొని… జవాన్లకు అండగా ఉండండి.. అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఎన్నికల టైమ్ లో ప్రజల్ని రెచ్చగొట్టి.. అల్లర్లు జరిగేలా దయచేసి చేయకండి.. మీరు ఇచ్చే ఏ ఒక్క స్కీమ్ వల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేదన్నారు.

మీవి అన్ని మాటలే.. కానీ మా సీఎం చేతల్లో చూపిస్తున్నాడు… హిందు ధర్మాన్ని కాపాడుకుంటూ… యాగాలు చేస్తున్నాం.. అందుకే మంచిగా వర్షాలు పడుతున్నాయి.. యాదాద్రి ని నిర్మిస్తున్నాం.. కనిపించడం లేదా అన్నారు. ఇక ఎవరు ఏ గాలం వేసినా… ఒక్క చేప కూడ పడదు. అది వాళ్లకు అర్థం అవ్వట్లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

FOR More News…

ఇకపై ఆయుర్వేద డాక్టర్లూ ఆపరేషన్లు చేయొచ్చు

జీరో బడ్జెట్ రాజకీయాలు చేసే దమ్ముందా..?

వీడియో: మహిళలను వేధిస్తున్న ఆకతాయిలతో రోడ్డు మీదే..

జీహెచ్ఎంసీ ఎన్నికలు: చిన్న వయసులోనే నామినేషన్

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేటీఆర్‌ని కలిసిన యాంకర్ సుమ

చేతిలో రూపాయి లేకుండా కార్పొరేటర్ బరిలోకి

ప్రచారానికి పోతే రూ.1000, బిర్యానీ ప్యాకెట్