ఉక్రెయిన్కు అండగా నిలుస్తాం: బైడెన్

ఉక్రెయిన్కు అండగా నిలుస్తాం: బైడెన్

వాషింగ్టన్: రష్యా దాడులతో దెబ్బతిన్న ఉక్రెయిన్ దేశానికి అమెరికా అండగా నిలుస్తుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్ దేశానికి అండగా నిలిచి వారికి అవసరమైన నిధులు, మానవత్వ సేవలు అందిస్తామని తెలిపారు. అమెరికా తీసుకున్న నిర్ణయాలతో రానున్న రోజుల్లో రష్యన్ సైనిక వ్యవస్థ, మిలిటరీ బలహీనం అవుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రష్యా నాయకుల విలాస భవనాలు, ప్రైవేటు జెట్ విమానాలు సహా ఇతర ఆస్తులు స్థంభించేలా చర్యలు తీసుకుంటున్నామని.. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో సగం వాటా కలిగిన 30 దేశాలు కూడా రష్యాపై ఆంక్షలు విధించాయని బైడెన్ వైట్ హౌస్ లో మీడియా సమావేశం పెట్టి వెల్లడించారు. అమెరికా స్టాక్ ఎక్ఛేంజీలు రష్యన్ సెక్యూరిటీల ట్రేడింగ్ ను ఇప్పటికే నిలిపేశాయని బైడెన్ వివరించారు. 

 

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్

వండర్స్‌‌ క్రియేట్‌‌ చేయాలంటే.. ఇలా కూడా చేయొచ్చు